Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా నిధులపై ఈసీ ఆంక్షలు... విడుదలకు బ్రేక్

  • రైతు భరోసా నిధులకు సంబంధించి సీఎం వ్యాఖ్యల మీద ఈసీకి ఫిర్యాదు
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనన్న ఈసీ
  • రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియకు బ్రేక్
EC restrictions on rythu bharosa funds

రైతు భరోసా నిధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. తెలంగాణలో ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఈసీ పేర్కొంది.

రైతు భరోసా నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద ఎన్.వేణు కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ... సీఎం నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొంది. రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం నిన్న ప్రకటించింది. కానీ ఈసీ తాజా ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది.

  • Loading...

More Telugu News